HOME » VIDEOS » Politics

Video : టీడీపీ సీనియర్ నేత బంగి ఆనంతయ్య ఆత్మహత్యాయత్నం..

ఆంధ్రప్రదేశ్14:41 PM March 04, 2020

కర్నూలు మాజీ మేయర్, టీడీపీ నేత బంగి ఆనంతయ్య ఆత్మహత్యయత్నం చేశారు. ఈ రోజు ఆయన తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించారు. భార్య, కూతురును కూరగాయల కోసం మార్కెట్‌కు వెళ్లిన సమయంలోనే అనంతయ్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు తెలుస్తోంది. రాజకీయంగా అందరూ తనను మోసం చేశారని కొంతకాలంగా ఆవేదనతో ఉన్న బంగి ఆనంతయ్య... ఆ కారణంగానే ఈ చర్యకు పాల్పడినట్టు సమాచారం. అయితే సకాలంలో కుటుంబ సభ్యులు గమనించి ఆయనను వెంటనే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాజకీయ కారణాలతో పాటు ఆర్థిక ఇబ్బందులు కూడా ఆయన ఆత్మహత్యాయత్నానికి కారణమైన ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది. కర్నూలు టీడీపీలో బంగి ఆనంతయ్య కీలక పాత్ర పోషించారు. విచిత్ర వేషధారణలతో ప్రభుత్వ విధానాలను ఎండగట్టడంతో అనంతయ్య ముందుండేవారు. అలాంటి బంగి అనంతయ్య ఈ రకంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారనే వార్త టీడీపీ నేతలను కలవరపెడుతోంది.

webtech_news18

Top Stories