కరోనా నివారణతో పాటు రైతులకు మేలు చేసేందుకు వైఎస్ జగన్ ఎంతో కృషిచేస్తున్నారని వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ప్రభుత్వం ఇంత పనిచేస్తుంటే.. చంద్రబాబు మాత్రం హోం క్వారంటైన్లో కూర్చొని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు లేఖలు రాయడం మానుకొని రెస్ట్ తీసుకుంటే మంచిదని ఎద్దేవా చేశారు మంత్రి.