ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే పూర్తి స్పష్టతను ఇచ్చారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసెడెంట్ కేటీఆర్ అన్నారు. రాజ్యసభలో టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ కె.కేశవరావు, లోక్ సభలో ఎంపీ కవితతో పాటు పలు వేదికలపై తాము స్పెషల్ స్టేటస్ పై తమ వైఖరిని స్పష్టం చేశామని చెప్పారు.