HOME » VIDEOS » Politics » KAVITHA WILL DEFINITELY WIN MLC ELECTIONS SAYS MINISTER PRASANTH SK

Video: ఎమ్మెల్సీ ఎన్నికలో కవితదే విజయం... మంత్రి ధీమా

తెలంగాణ22:23 PM March 19, 2020

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అఖండ మెజార్టీతో విజయం సాధిస్తారని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి మొత్తం 824 మంది ప్రజాప్రతినిధులు ఓటర్లుగా ఉన్నారని, ఇందులో టీఆర్ఎస్ సంఖ్యా బలం 504 ఉందని చెప్పారు. ఎంఐఎంకు చెందిన 28 మంది ఓటర్లు, 66 మంది స్వతంత్ర ఓటర్లు కూడా కవితకే మద్దతిస్తారని తెలిపారు ప్రశాంత్ రెడ్డి. దాంతో టీఆర్ఎస్ సంఖ్యా బలం 598కి చేరిందని.. ఈ నేపథ్యంలో 141 సంఖ్యాబలం ఉన్న కాంగ్రెస్, 85 మంది ఓటర్ల బలమున్న బీజీపీ తమతో ఎలా పోటీపడుతుందని ఆయన అన్నారు.

webtech_news18

Top Stories