Lok Sabha Elections: కరీంనగర్ ఎంపీగా గెలిచిన సందర్భంగా బండి సంజయ్ కుమార్ వేములవాడలో శ్రీరాజరాజేశ్వరస్వామిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా వచ్చి ప్రత్యేక పూజలు చేశారు. ఎన్డీయే తరఫున 351 మంది గెలిచారని 351 కోడెలను కట్టి మొక్కులు తీర్చుకున్నారు. దర్శనానంతరం సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పేదల కోసం పని చేస్తానని అన్నారు.