జమ్మికుంటలో కాంగ్రెస్ కార్యకర్తలు కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ పాదయాత్రను అడ్డుకొని దాడి చేశారు. పోలీసులు అక్కడే ఉన్నా కనీసం ఆపే ప్రయత్నం కూడా చేయక పోవడంతో ఆయన పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ కార్యకర్తలు శాంతియుతంగా ఉన్నారని, అదే వాళ్లు తిరగబడితే పరిస్థితి దారుణంగా మారుతుందని పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు.