మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు వైసీపీలో చేరారు. ఏపీ సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. నమ్మించి మోసం చేయడంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు దిట్ట అని విమర్శించారు. సీఎం వైఎస్ జగన్ మాట ఇస్తే మడమతిప్పని నాయకుడు అని అన్నారు. సీఎం జగన్పై ఉన్న నమ్మకంతోనే వైసీపీలో చేరుతున్నట్టు తెలిపారు.