మూడు రాష్ట్రాల్లో బీజేపీని ప్రజలు సాగనంపారన్నారు మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింథియా. ఎంపీలో ప్రభుత్వ ఏర్పాటుకు స్పష్టమైన మెజార్టీ సాధించామన్నారు. ఐదురాష్ట్రాల్లో కలిపినా కూడా బీజేపీకి 200 సీట్లు రాలేదని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా బీజేపీ అహంకారాన్ని వదిలి నేలమీద నడవాలన్నారు సింథియా