హోమ్ » వీడియోలు » రాజకీయం

దేశవ్యాప్తంగా డాక్టర్ల సమ్మె.. మమతా బెనర్జీ హెచ్చరికను పట్టించుకోని..

జాతీయం14:08 PM June 14, 2019

పశ్చిమ బెంగాల్‌లోని ఎన్‌ఆర్‌ఎస్‌ మెడికల్‌ కాలేజీ, ఆస్పత్రిలో జూనియర్‌ వైద్యులపై దాడిని నిరసిస్తూ దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో వైద్యులు ఈ రోజు సమ్మెకు దిగారు. ఎయిమ్స్‌ రెసిడెంట్‌ సంఘం పిలుపుతో ఢిల్లీ సహా ముంబై, బెంగళూరు, హైదరాబాద్‌ తదితర నగరాల్లో వైద్యులు విధులు బహిష్కరించి ఆందోళన చేస్తున్నారు. దేశ రాజధానిలో పలువురు రెసిడెంట్‌ వైద్యులు జంతర్‌ మంతర్‌ వద్ద నిరసన చేపట్టారు. మరోవైపు పశ్చిమ బెంగాల్‌లో జూనియర్‌ వైద్యుల సమ్మె నాలుగో రోజుకు చేరడంతో సమ్మె విరమించాలని ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ హెచ్చరించారు. ఆమె హెచ్చరికను పట్టించుకోని వైద్యులు సమ్మెను కొనసాగించారు.

Shravan Kumar Bommakanti