Telangana Assembly poll: తెలంగాణ ఎన్నికల పోలింగ్ సందర్భంగా కుటుంబసభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్. ఉదయం భార్య లక్ష్మీ ప్రణతి, తల్లి షాలినితో కలిసి జూబ్లీహీల్స్ పోలింగ్ బూత్ వద్దకు చేరుకున్నారు. ఓటు వేసేందుకు దాదాపు 40 నిమిషాల పాటు క్యూలైన్లో వేచి ఉన్నారు. ఆతర్వాత ఓటు వేశారు.