బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. భేటీ తర్వాత పవన్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాజధాని పరిపాలన వికేంద్రీకరణతో కేంద్రానికి సంబంధం లేదని అన్నారు. కేంద్రం అనుమతితోనే మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చామన్న వైసీపీ వాదనలో నిజం లేదని, ఇదే విషయాన్ని కేంద్రం స్పష్టం చేసిందని చెప్పారు. ప్రధాని, హోంమంత్రికి సంబంధం లేదని తెలిపారు.