హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : పవన్ కళ్యాణ్ కొత్త పిలుపు.. తెలుగు కోసం, నదుల కోసం

ఆంధ్రప్రదేశ్21:05 PM November 20, 2019

తెలుగు భాషను పరిరక్షించుకోవడానికి, నదులను సంరక్షించుకోవడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నడుం బిగించారు. జనసేన ఆధ్వర్యంలో ‘మన నుడి.. మన నది’ కార్యక్రమాలు నిర్వహించాలని సంకల్పించారు. మన భవితకు ప్రాణాధారమైన మాతృభాషను కాపాడుకోలేకపోతే సంస్కృతికి దూరమవుతామని పవన్ కళ్యాణ్ అన్నారు. ‘నాగరికతకు పుట్టినిల్లు నది. నది లేనిదే సంస్కృతి లేదు. నది నశించాక ఆ సంస్కృతి మిగలదు. దీనికి చరిత్రలో కావాలసినన్ని రుజువులు ఉన్నాయి. నాగరికతకు అమ్మ ఒడి నుడి. భాష లేనిదే సంస్కృతి లేదు. మాతృభాష గతించాక సంస్కృతి మిగలదు. మన మనుగడకు జీవనాధారమైన నదులను మనం చేతులారా విషమయం చేస్తున్నాం. మన భవితకు ప్రాణాధారమైన అమ్మనుడికి మనం అతివేగంగా దూరమవుతున్నాం. మాతృభాష మూలాలను మనమే నరికేసుకుంటున్నాం.’ అని పవన్ కళ్యాణ్ అన్నారు. నదిని, నుడిని కాపాడుకోవడానికి ‘మన నుడి.. మన నది’ కార్యక్రమం చేపట్టాలని జనసేన నిర్ణయించింది.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading