హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : భారత్‌-అమెరికా బంధం చిరకాలం కొనసాగాలి : ప్రధాని మోదీ

జాతీయం16:54 PM February 24, 2020

Trump India Visit : ప్రపంచంలో అతి పెద్ద స్టేడియం నుంచీ ట్రంప్... భారతీయుల్ని ఉద్దేశించి ప్రసంగించారన్న ప్రధాని నరేంద్ర  మోదీ... ఇంత పెద్ద స్టేడియంలో ఈ కార్యక్రమం నిర్వహించినందుకు గుజరాత్ క్రికెట్ మండలికి ధన్యవాదాలు చెబుతున్నానన్నారు. ట్రంప్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పిన మోదీ... రెండు దేశాల సత్సంబంధాలపై మాట్లాడారు. విశ్వాసం వల్లే సంబంధాలు కొనసాగగలవన్న మోదీ... ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలన్నారు. కొన్నేళ్లుగా... అమెరికా, భారత్ మధ్య విశ్వాసాలు మరో మెట్టు పైకి ఎక్కాయన్నారు. తాను వాషింగ్టన్ వెళ్లినప్పుడు... ఇండియా తమకు నిజమైన స్నేహితుడని ట్రంప్ అన్నట్లు గుర్తు చేసిన మోదీ... ట్రంప్ వైట్ హౌస్ లో దీపావళి జరిపినప్పుడు అమెరికాలో భారతీయులంతా గర్వంగా ఫీలయ్యారని అన్నారు. ఇప్పుడు అమెరికా... భారత్‌తో కలిసి న్యూ ఇండియా నిర్మాణానికి పూనుకుందన్నారు. ఇప్పుడు భారత్ ప్రపంచంలోనే అతి పెద్ద హెల్త్ ఇన్సూరెన్స్ స్కీం కలిగి ఉందనీ, అతి పెద్ద సోలార్ పవర్ ప్రాజెక్టు, అతి పెద్ద పారిశుధ్య కార్యక్రమం ఇండియా నిర్వహిస్తోందన్నారు. శాటిలైట్ల ప్రయోగంలో భారత్ ప్రపంచ రికార్డ్ నెలకొల్పిందన్న మోదీ... త్వరలో భారత్ మరిన్ని ముందడుగులు వేస్తుందన్నారు. భారత్‌లో వస్తున్న మార్పులకు అమెరికా భరోసా ఇస్తోందన్న మోదీ... భారత వాణిజ్యంలో అమెరికాకి ఎక్కువ ప్రాధాన్యం ఉందన్నారు. అమెరికా, భారత్‌తో కలిసి ఎన్నో పరిశోధనలు చేస్తోందన్నారు. అన్ని రంగాల్లో అమెరికా-భారత్ మధ్య సత్సంబంధాలున్న మోదీ... భవిష్యత్తులో ఇది మరింత ముందుకు సాగుతుందన్నారు.

webtech_news18