తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, ఆయన బంధువుల ఇళ్లపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్న రోజే ఆయన ఇంటిపై రైడ్స్ జరిగాయి. ఎన్నికల ప్రచారం కోసం రూ.3 కోట్లను ఆయన ఇటీవల తీసుకొచ్చినట్టు ఐటీ అధికారులు భావించి దాడి చేసినట్టు చెబుతున్నారు. హైదరాబాద్, కొడంగల్‌తోపాటు మొత్తం 15 చోట్ల సోదాలు జరుగుతున్నట్టు సమాచారం. రేవంత్ రెడ్డి సోదరుడికి చెందిన భూపాల్ కన్స్ట్రక్షన్ కంపెనీలో కూడా ఐటీ అధికారులు తనిఖీ చేస్తున్నారు.