కరోనా భయంతో వణికిపోతున్న రాష్ట్ర ప్రజలకు మంత్రి ఈటల రాజేందర్ తీపి కబురు అందించారు. గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కోలుకున్నాడు. ఒక టెస్టులో అతడికి కరోనా నెగెటివ్ వచ్చిందని ఈటల రాజేందర్ ప్రకటించారు. పుణె వైరాలజీ ల్యాబ్ నుంచి మరో టెస్ట్ రావాల్సి ఉందని.. దాని కోసం వేచిచూస్తున్నామని చెప్పారు. మన రాష్ట్రంలో ప్రస్తుతం ఒక్క కరోనా కేసు కూడా లేదని తెలిపారు. మన వాతావరణ పరిస్థితుల్లో కరోనా వైరస్ బతకలేదని.. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు ఈటల.