హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : బురద నీటిలో పడుకొని కార్పొరేటర్ వినూత్న నిరసన

తెలంగాణ21:03 PM September 27, 2019

హైదరాబాద్ లో గతవారం రోజులుగా కురుస్తున్న వర్షానికి రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతలన్నీ జలమయమయ్యాయి. నాళాలు,డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. ఈ క్రమంలో కార్పొరేటర్ సామ తిరుమల్ రెడ్డి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. మంగళవారం కురిసిన కుండపోత వర్షానికి హయత్‌నగర్‌ డివిజన్‌ పరిధిలోని సుష్మా సాయినగర్‌ ‘గ్రీన్‌ మిడోన్‌ కాలనీ’లోకి వెళ్లే దారిలో భారీగా వర్షపు నీరు చేరింది. దీంతో కాలనీవాసులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. ఈ విషయాన్ని వారు స్థానిక కార్పొరేటర్‌ తిరుమల్‌ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కూడా పాటించుకోకపోవడంతో ఆయన బురద నీటిలో పడుకొని నిరసన వ్యక్తం చేసాడు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading