అమరావతిలోని జనసేన పార్టీ కార్యాలయం వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. రాజధాని గ్రామాల్లో పర్యటనకు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బయలుదేరనున్నారు. ఈ క్రమంలో జనసేన కార్యాలయం చుట్టూ పోలీసుల భారీగా మోహరించారు. పోలీసుల రాకపై జనసేన పార్టీ శ్రేణులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. జనసేన కార్యాలయంలోకి పోలీసులను రాకుండా జనసేన శ్రేణులు అడ్డుకున్నాయి. ఎర్రబాలెం, పెనుమాక, మందడం, గ్రామాల్లో పర్యటించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం మూడు రాజధానులు పెట్టాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారు. అధికార, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు, అమరావతి మెట్రో డెవలప్మెంట్ బిల్లులను జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మద్దతు పలికారు.