అమరావతిలో ఉద్యమం చేస్తున్న మహిళలకు హ్యాట్సాఫ్ అని చెప్పారు నారా చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి. సొంతూరు నారావారి పల్లెలో ఆమె మీడియాతో మాట్లాడారు. తమ బిడ్డలు, మనవళ్లు, మనవరాళ్ల భవిష్యత్ బాగుంటుందన్న ఆలోచనతో అప్పుడు రైతులు అమరావతికి భూములు ఇచ్చారని, ఇప్పుడు వారు చేస్తున్న పోరాటం సరైనదేనని అభిప్రాయపడ్డారు. ఈ ఉద్యమంలో రాష్ట్రంలోని మహిళలు అందరూ కూడా పాల్గొనాలని పిలుపునిచ్చారు.