ఏపీ రాజకీయాల్లో ఇది చారిత్రక నిర్ణయం. రాష్ట్ర రాజకీయాలను ప్రక్షాళన చేయడంలో ఇది శుభపరిణామం. రాబోయే రోజుల్లో ఈ కూటమి ప్రత్యామ్నాయ రాజకీయ కూటమిగా ఎదుగుతుంది. ఏపీలో కూడా అద్భుత రాజకీయ ఫలితాలు సృష్టించగలం. ఈ కూటమిని ప్రజలు ఆదరిస్తారని, ఆశీర్వదిస్తారని నమ్ముతున్నా. బీజేపీలో కలిసి ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నందుకు పవన్‌కు ధన్యవాదాలు.