హోమ్ » వీడియోలు » రాజకీయం

Video:టీఆర్ఎస్‌‌లో చేరిన మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డి

తెలంగాణ09:00 PM IST Sep 12, 2018

ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీ మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డి బుధవారం టీఆర్ఎస్‌లో తీర్థం పుచ్చుకున్నారు. మంత్రులు కేటీఆర్, ఈటెల రాజేందర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎంపీలు కేశవరావు, కవిత సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు. రాజకీయంగా ప్రజలు తనను మరచిపోతున్న తరుణంలో సీఎం కేసీఆర్ తనను పార్టీలోకి ఆహ్వానించారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటానని, తన ఆలోచనలకు సరైన వేదిక దొరికిందని తెలిపారు. టీఆర్ఎస్ హయాంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో తెలంగాణ రాష్ట్రం దూసుకెళ్తోందన్నారు.

webtech_news18