Union Budget 2019: పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇందిరాగాంధీ తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టిన రెండో మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ హేమమాలిని మాట్లాడుతూ.. మహిళా మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టడం పట్ల తాను గర్వంగా ఫీలవుతున్నానని, నారీ అంటే నారయణి అని ఆమె అన్నారు. దేశంలోని ప్రతి ఒక్కరు దీన్ని అర్థం చేసుకుంటే.. మహిళలపై హింస అనేదే జరగదని అన్నారు.