డీఎంకే సీనియర్ నేత దురై మురుగన్ అమరావతలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడితో సమావేశమయ్యారు. భేటీలో జాతీయ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీ భాగస్వామ్యం, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. స్టాలిన్‌తో భేటీ జరిగిన మరుసటి రోజే టీడీపీతో డీఎంకే చర్చలు జరపడం హాట్‌టాపిక్‌గా మారింది. నిన్న కేసీఆర్-స్టాలిన్ భేటీలోనూ దురై ముురుగన్ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో వారిద్దరి భేటీకి సంబంధించిన అంశాలను చంద్రబాబు వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది.