ఢిల్లీలో హ్యాట్రిక్ విజయం సాధించిన ఆమాద్మీ పార్టీ సంబరాల్లో ముగినిపోయింది. భార్య పుట్టిన రోజు నాడే చిరస్మరణీయ గెలుపు అందుకున్న కేజ్రీవాల్.. పార్టీ నేతలు, కుటుంబ సభ్యులతో కలిసి పండగ చేసుకుంటున్నారు. ఫలితాల అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన కేజ్రీవాల్.. ఐ లవ్ యూ ఢిల్లీ అంటూ ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు. సొంత కొడుకులా ఆదరించి మూడోసారి నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు తెలిపారు కేజ్రీవాల్. ఢిల్లీ ద్వారా దేశంలో కొత్త తరహా రాజకీయాలు మొదలయ్యాయని ఆయన అన్నారు.