ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు కర్ణాటక సీఎం కుమారస్వామి. వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలనే అంశంపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్టు తెలిపారు. ప్రాంతీయ పార్టీలన్నింటిని ఏకం చేసి ఎన్డీయేను ఎదుర్కొంటామని చెప్పారు. ప్రతిపక్షాల తరుపున ప్రధాని అభ్యర్థి ఎవరన్న ప్రశ్నకు.. ఎన్నికల తర్వాతే దానిపై నిర్ణయం ఉంటుందన్నారు. బీజేపీ రాజకీయాల నుంచి దేశాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని అన్నారు.