హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : అందుకు ఒప్పుకోకపోతే వైఎస్ విగ్రహాన్ని కూడా కూల్చేస్తాం : వీహెచ్

తెలంగాణ11:10 AM June 18, 2019

రాజ్యాంగ నిర్మాత డా.బాబా సాహెబ్ అంబేడ్కర్‌ను తెలంగాణ ప్రభుత్వం అవమానపరుస్తోందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్. ఆయన రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారమే తెలంగాణ వచ్చిందని గుర్తుచేశారు. కానీ అలాంటి మహనీయుడి విగ్రహాన్ని పెట్టుకునే పరిస్థితి లేకపోవడం విచారకరం అన్నారు. పంజాగుట్ట సర్కిల్‌లో తొలగించిన అంంబేడ్కర్ విగ్రహ పున:ప్రతిష్టకు మంగళవారం ఆయన ప్రయత్నించారు. తెల్లవారుజామునే అక్కడికి చేరుకుని విగ్రహ ఏర్పాటుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. వైఎస్ విగ్రహానికి లేని అభ్యంతరం అంబేడ్కర్ విగ్రహానికి ఎందుకని వీహెచ్ ప్రశ్నించారు. అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేయనివ్వకపోతే వైఎస్ విగ్రహాన్ని కూడా కూల్చివేస్తామని వీహెచ్ హెచ్చరించారు. అంబేడ్కర్ విగ్రహం పున:ప్రతిష్టించేవరకు తమ పోరాటం ఆగబోదని స్పష్టం చేశారు.

webtech_news18