భువనగిరి నుంచి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రజాగాయకుడు గద్దర్‌ను కలిశారు. ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. కోమటిరెడ్డితో పాటు అద్దంకి దయాకర్ గద్దర్‌ను కలిసిన వారిలో ఉన్నారు. ఇప్పటికే మల్కాజ్ గిరి కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి సైతం తనకు మద్దతు ఇవ్వాలని గద్దర్‌ను కలిశారు.