ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని అచ్చంపేటలో ప్రచారం నిర్వహిస్తున్న కాంగ్రెస్ నేతలకు ఊహించని షాక్ తగిలింది. వేదికపై కాంగ్రెస్ సీనియర్ నేతలు భట్టి విక్రమార్క, విజయశాంతి ఉండగా ఒక్కసారిగా స్టేజీ కుప్పకూలింది. అప్రమత్తమైన కాంగ్రెస్ నేతలు తృటిలో తప్పించుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. సభలో మాట్లాడేందుకు విజయశాంతి ముందుకు వచ్చి కార్యకర్తలకు అభివాదం చేస్తుండగా ఒక్కసారికి కిందపడిపోయారు. అప్రమత్తమైన పలువురు మహిళా నేతలు ఆమెను వెంటనే పైకి లేపారు.