ప్రధాని మోదీ పర్యటన వేళ అరుణాచల్‌ప్రదేశ్ రాజకీయాల్లో 'ఓటుకు నోటు' వ్యవహారం సంచలనం రేపుతోంది. సీఎం పెమా ఖండూ, డిప్యూటీ సీఎం చౌనా మెయిన్, ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు తాపిర్ గావ్ ప్రయాణించిన కాన్వాయ్‌లో భారీ మొత్తంలో డబ్బులు పట్టుబడ్డాయి. రెండు కార్ల నుంచి రూ.1.8 కోట్లను ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడీ వ్యవహారం అరుణాచల్‌తో పాటు దేశ రాజకీయాల్లోనూ దుమారం రేపుతోంది. మోదీ సభకు హాజరయ్యే జనాలకు పంచేందుకే డబ్బులను తరలించినట్లు కాంగ్రెస్ ఆరోపిస్తోంది.