రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల రూపురేఖలు మార్చే విధంగా రూపొందించిన పట్టణ ప్రగతి కార్యక్రమంపై సీఎం కేసీఆర్.. అధికారులు, ప్రజాప్రతినిధులకు మార్గనిర్దేశనం చేసారు. సదస్సులో ఎమ్మెల్యేలు, మేయర్లు, మున్సిపల్ ఛైర్పర్సన్లు, కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. పట్టణ ప్రగతికి సన్నాహకంగా జరుగుతున్న ఈ సదస్సులో కార్యక్రమ నిర్వహణపై సీఎం చర్చించారు.