కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దర్శనం అనంతరం.. ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్మి (మెడిగడ్డ) బ్యారేజ్ వద్దకు చేరుకున్నారు. లక్ష్మీ బ్యారేజ్ వద్ద నిండు కుండను తలపిస్తున్న ప్రాణహిత నది జలాలను ఏరియల్ సర్వే ద్వారా కేసీఆర్ వీక్షించినారు. బ్యారేజ్ మీద నుంచి గోదావరి నది లో నాణాలు వదిలి, ఉద్యమ కాలం నాటి మొక్కులు చెల్లించు కున్నారు.