HOME » VIDEOS » Politics

Video : కేంద్రాన్ని నమ్ముకుంటే అంతే.. మోదీపై కేసీఆర్ సెటైర్

తెలంగాణ20:27 PM March 12, 2020

కేంద్రంలోని బీజేపీని నమ్ముకుంటే శంకరగిరి మాన్యాలు పట్టాల్సిందేనని తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో విమర్శించారు. కాంగ్రెస్‌తో విసిగిపోవడం వల్లే దేశ ప్రజలు బీజేపీని గెలిపించాలని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని బీజేపీ దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. పన్నులు, వసూలు చేసే బాధ్యత మాత్రమే కేంద్రానికి ఉందని అన్నారు. జీఎస్టీ వల్ల కలిగే నష్టాన్ని ఐదేళ్ల పాటు కేంద్రమే భరిస్తుందని చట్టంలో పెట్టారని... దానిని కేంద్రం పట్టించుకోవడం లేదని కేసీఆర్ విమర్శించారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు సక్రమంగా రావడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం తీరు మార్చుకోవాలని కేసీఆర్ సూచించారు. బడ్జెట్‌లో కేటాయించిన రూ. 3900 కోట్లు కేంద్రం ఇవ్వలేదని మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ తెలంగాణకు చేసిందేమీ లేదని వ్యాఖ్యానించారు. బీజేపీ ఇప్పటికైనా నీచ బుద్ధి మానుకోవాలని అన్నారు. తాము కేంద్రానికి రూ. 50 వేల కోట్లు ఇస్తే...రూ. 24 వేల కోట్లు తెలంగాణకు ఇస్తోందని మరోసారి సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

webtech_news18

Top Stories