హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : ఎన్నికల సంఘంపై ఫైట్‌కు ఢిల్లీకి చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్12:05 PM April 13, 2019

ఎన్నికలను నిష్పాక్షికంగా నిర్వహించడంలో కేంద్ర ఎన్నికల సంఘం దారుణంగా విఫలమైందని ఆరోపించిన ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు... ఈ అంశాన్ని సీఈసీ సునీల్ అరోరా దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఇందుకోసం ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. మధ్యాహ్నం సునీల్ ఆరోరాతో సమావేశం కానున్న చంద్రబాబు... ఏపీలో ఎన్నికలు ఏ విధంగా జరిగాయి... ఈవీఎంలు ఏ రకంగా ఇబ్బందిపెట్టాయనే అంశాలను ఆయనకు వివరించబోతున్నట్టు తెలుస్తోంది. దీనిపై ఆయన ఏ రకంగా స్పందిస్తారనే దాన్నిబట్టి... ఢిల్లీలో మంత్రులు, ఎంపీలతో కలిసి ధర్నాకు దిగడంపై చంద్రబాబు నిర్ణయం తీసుకోనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

webtech_news18