ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి రెండు చేతులు ఎత్తి నమస్కారం చేశారు. ఈ అరుదైన ఘటనకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వేదికగా మారింది. రాష్ట్రంలో మూడు రాజధానులు, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులపై చర్చ సందర్భంగా చంద్రబాబునాయుడు మాట్లాడారు.