రాజధానిని తరలించాలనే నిర్ణయం చరిత్రలో బ్లాక్ డేగా మిగిలిపోతుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కర్ఫ్యూ వాతావరణం నెలకొని ఉందని, జగన్ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నదని, చరిత్రలో ఇలాంటి దారుణాలు ఎప్పుడూ జరగలేదని మండిపడ్డారు. జగన్ తగిన మూల్యం చెల్లించుకుంటాడని ఈ సందర్భంగా చంద్రబాబు తెలిపారు.