అమరావతిలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమరావతి ఐక్య పరిరక్షణ సమితి చేపట్టిన బస్సు యాత్రను పోలీసులు అడ్డుకున్నారు. బస్సులు సీజ్ చేయడాన్ని నిరసిస్తూ చంద్రబాబు పాదయాత్ర చేపట్టారు. దీంతో పోలీసులు చంద్రబాబు యాత్రకు బ్రేక్స్ వేశారు. దీంతో జేఏసీ నేతలు రోడ్డు మీద బైఠాయించారు. అనంతరం వారందరినీ పోలీసులు వాహనంలో ఎక్కించారు.