ఇటీవల హైదరాబాద్ లోని ఏషియన్ ఇన్సిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ ఆస్పత్రిలో రాజ్యసభ సభ్యుడు డి శ్రీనివాస్ కిడ్నీకి సంబంధించిన చికిత్స చేయించుకున్నారు.. ఈ రోజు కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ డి.శ్రీనివాస్ ను ఆసుపత్రిలో పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మంత్రితో పాటు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ , ఆదిలాబాద్ ఎంపి సోయం బాపు రావు కూడా ఉన్నారు.