విజయవాడ వేదికగా బీజేపీ, జనసేన కీలక సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి బీజేపీ తరపున రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు, సునీల్ దేవధర్, పురంధేశ్వరి, సోము వీర్రాజు హాజరయ్యారు. ఇక జనసేన తరపున సమావేశంలో పాల్గొనేందుకు పవన్కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు. ఈ భేటీ బీజేపీ, జనసేన ఉమ్మడి కార్యాచరణ తదితర అంశాలపై ముఖ్యంగా చర్చించనున్నట్లు సమాచారం.