ఈనెల 17న మరోసారి హైపవర్ కమిటీ భేటీ కావాలని నిర్ణయం తీసుకున్నామని మంత్రి పేర్ని నాని తెలిపారు. రాజధాని రైతులు ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారో, రాతపూర్వకంగా సీఆర్డీఏ కమిషనర్‌కు 17సాయంత్రంలోగా అందజేయాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. ఈ మెయిల్ ద్వారా సూచనలు, సందేహాలు పంపాలని కోరారు.