పవన్ కల్యాణ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మంత్రి పేర్నినాని. ఏపీలో జగన్ పాలన బాగుంటే... తాను మళ్లీ సినిమాలు చేసుకుంటానన్న పవన్ మాటల్ని ఆయన గుర్తు చేశారు. పవన్ సోమవారం పింక్ రిమేక్ షూటింగ్లో పాల్గొన్న విషయం తెలిసింది. దీంతో పవన్ సినిమాలు చేసుకుంటున్నారంటే... జగన్ పాలన బాగున్నట్లే కదా అని చమత్కరించారు పేర్ని నాని.