ఏపీ నుంచి కియా పరిశ్రమ తరలిపోతుందని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వం ఇస్తున్న సహకారంలో కియా సంస్థ యాజమాన్యం ఎంతో సంతృప్తిగా ఉందని ఆయన తెలిపారు. అసలు ఈ రకమైన వార్తలు ఎందుకు వచ్చాయో తమకు కూడా తెలియదని కియా సంస్థ యాజమాన్యం చెప్పిందని బుగ్గన అన్నారు. కొందరు కావాలనే కుట్రతో ఇలా చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఇలా చేస్తున్నారని అన్నారు. సోషల్ మీడియాలో ఇలాంటి దుష్ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బుగ్గన స్పష్టం చేశారు.