విజయవాడ ఆర్టీసీ భవన్లో రాజధానిపై నియమించిన హైపవర్ కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ కొందరు రాజధాని రైతులు తన దగ్గరకు వచ్చి కొన్ని సమస్యలు చెప్పారన్నారు. వారి వద్ద నుంచి కొనుగోలు చేసిన భూములు తమకే దక్కేలా జీవోను సవరించాలని కోరారన్నారు. ఇంకా ఎవరైనా రాజధాని రైతులు మా వద్దకు వస్తే వారి సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తామన్నారు బొత్స. ఇదే చివరి సమావేశమని చెప్పలేమన్నారు. అవసరాన్ని బట్టి సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ఉద్యోగుల తరలింపు అంశాన్నీ కూడా పరిశీలిస్తున్నామన్నారు.