హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : అయ్యప్ప దీక్షలో చెప్పుల వివాదం.. మంత్రి అవంతి వివరణ

ఆంధ్రప్రదేశ్17:59 PM November 19, 2019

అయ్యప్ప మాల వేసుకొని చెప్పులతో నడుస్తున్నారంటూ తనపై వస్తున్న విమర్శలపై ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ స్పందించారు. అనారోగ్య కారణాల వల్లే చెప్పులు వేసుకొంటున్నానని వివరణ ఇచ్చారు. తన కంటే అమితంగా హిందూ మతాన్ని ప్రేమించే వాళ్లు ఎవరూ లేరని మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు. తాను హిందూ మతంలోనే పుట్టాను.. హిందూ మతంలోనే చనిపోతాను అని స్పష్టం చేశారు. టీడీపీ ఎంపీగా ఉన్నప్పుడు కూడా.. మాల వేసుకొని చెప్పులతో నడిచానని... ఆ పార్టీ నేత మురళీమోహన్ కూడా మాలలో చెప్పులు వేసుకొంటారని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు.

webtech_news18