ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేక హోదా ఇస్తానని అధికారం రాగానే మాట తప్పారన్నారు ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత. విభజన తర్వాత ఏర్పాటైన కొత్త రాష్ట్రాన్ని ఆర్థికంగా ఎదిగేందుకు నిధులు ఇవ్వడంతో పాటు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. 14వ ఆర్థిక సంఘం నీతి అయోగ్ పేరిట నిధులు ఇవ్వకుండా రాష్ట్రానికి అన్యాయానికి గురి చేయడం సరికాదన్నారు.