జనసేన అధినేత పవన్‌కల్యాణ్ తీరును ఏపీ హోంమంత్రి సుచరిత తప్పుబట్టారు. పవన్ ఏ పార్టీతో ఉన్నారో ఆయనకే తెలియదన్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసి ఉంటే.. వైసీపీ ఎక్కడ ఉండేదని పవన్ వ్యాఖ్యలకు సుచరిత కౌంటరిచ్చారు. 151 సీట్లు ఇచ్చి వైసీపీని ప్రజలు గుర్తించారని అన్నారు దిశ ఘటనలో నిందితులకు రెండు బెత్తం దెబ్బలు వేస్తే.. సరిపోతుందని జనసేనాని చేసిన వ్యాఖ్యలపై ఆమె మండిపడ్డారు. నిందితులకు వేగంగా శిక్ష పడాలన్నదే తమ అభిమతమని సుచరిత చెప్పారు.