ఏపీ డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖా మంత్రి పాముల పుష్ప శ్రీవాణి ఓ తెలుగు సినిమాలో నటిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయం ప్రాధాన్యం తెలిపేలా తెరకెక్కిస్తున్న 'అమృత భూమి' అనే సినిమాలో పుష్ప శ్రీవాణి నటిస్తున్నారు. అయితే ఆమె ఈ సినిమాలో టీచర్ పాత్రలో మనకు కనిపించనున్నారు.