హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : నారా భువనేశ్వరికి డిప్యూటీ సీఎం కౌంటర్

ఆంధ్రప్రదేశ్22:08 PM January 01, 2020

రాజధాని ప్రాంత రైతులకు ఇవ్వాల్సింది గాజులు కాదని,ఇన్‌సైడర్ ట్రేడింగ్ పేరుతో పప్పుబెల్లాల మాదిరిగా చవగ్గా కొట్టేసిన భూములు అని డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి అన్నారు. భువనేశ్వరి కుటుంబానికి చెందిన హెరిటేజ్ కంపెనీ పేరుతో ఇన్‌సైడర్ ట్రేడింగ్ చేసి 14.22 ఎకరాల భూమిని చవక ధరకు కొట్టేశారని ఆరోపించారు. ఆ భూమిని రైతులకు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. మీరిచ్చే గాజుల కన్నా.. ఆ రైతులకు కలిగిన నష్టం వందల రెట్లు పెద్దది అన్నారు. బుధవారం అమరావతి ప్రాంత రైతుల ఆందోళనల్లో పాల్గొన్న నారా భువనేశ్వరి.. అక్కడి రైతుల పోరాటం కోసం తన బంగారు గాజును విరాళంగా ఇవ్వడాన్ని డిప్యూటీ సీఎం విమర్శించారు

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading