హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : ఏపీలో తొలి దిశ పోలిస్ స్టేషన్ ప్రారంభించిన సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్14:35 PM February 08, 2020

మహిళలు, బాలల భద్రత కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘దిశ’ చట్టం అమలులో భాగంగా రాజమండ్రిలోని ‘దిశ’ తొలి పోలీస్‌ స్టేషన్‌ను సీఎం జగన్ శనివారం ప్రారంభించారు. మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి ఆయన దిశ ప్రత్యేక పోలీసు స్టేషనును పరిశీలించారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 18 దిశ పోలీస్‌ స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. ఒక్కో స్టేషన్‌లో డీఎస్పీలు, సీఐలు ఇద్దరు, ఐదుగురు ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లతో కలిపి మొత్తం 52 మంది పోలీస్‌ సిబ్బంది ఉంటారు. దిశ చట్టంపై అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేయడం, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఐఏఎస్‌ అధికారిణి కృతికా శుక్లా, ఐపీఎస్‌ అధికారి దీపికను ప్రభుత్వం ప్రత్యేక అధికారులుగా నియమించారు. దిశ పోలిస్ స్టేషన్ ఏర్పాటు అనేది ఓ విప్లవాత్మక నిర్ణయమని సీఎం జగన్ అన్నారు.

webtech_news18