వైఎస్ఆర్ కంటివెలుగు మూడో విడత కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కర్నూలులో ప్రారంభించారు. నూతనంగా నిర్మంచనున్న ఆరోగ్య కేంద్రాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జగన్ మాట్లాడారు. మార్చి 1 నుంచి అవ్వ, తాతలకు కంటి ఆపరేషన్లు చేయించనున్నట్లు జగన్ తెలిపారు. కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి వాలంటీర్ల ద్వారా ఇంటి వద్దే కళ్ల జోళ్లు అందిస్తామని చెప్పారు.