భారత దేశ పౌరసత్వ సవరణ బిల్లుపై అపోహలు తొలిగించి బిల్లుయొక్క ముఖ్య ఉద్దేశ్యాన్ని ప్రజలకు సవివరంగా వివరించేందుకు
జనజాగరణ అభియాన్ పేరిట ఈరోజు గుంటూరు సంపత్ నగర్ నందు ఇంటి ఇంటికీ కరపత్రాలు పంపిణీ చేశారు. ముఖ్యఅతిథిగా భాజపా రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ హాజరయ్యారు. ఈసందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పౌరసత్వ సవరణ బిల్లు భారతీయ పౌరుల కోసం కాదని ఏవి అయితే ముస్లిం దేశాలుగా పేర్కొన్న బాంగ్లాదేశ్,పాకిస్థాన్,ఆఫ్ఘనిస్థాన్ నుండి మన దేశానికి వచ్చిన శరణార్థుల కొరకు ఏర్పాటు చేయటం జరిగింది అని ఆయన తెలిపారు.