హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్‌కు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

ఆంధ్రప్రదేశ్15:03 PM November 07, 2019

ఆంధ్రప్రదేశ్ పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ అస్వస్థతకు గురయ్యారు. అసెంబ్లీ కమిటీ హాల్‌లో పీఏసీ మొదటి సమావేశం జరుగుతున్న సందర్భంగా ఒక్కసారిగా ఆయన అస్వస్థతకు లోనయ్యారు. ఆయనకు తీవ్ర కడుపునొప్పి రావడంతో సచివాలయంలోని థర్డ్ బ్లాక్‌లో ఉన్న డిస్పెన్సరీకి తరలించారు.అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం 108 వాహనంలో విజయవాడలోని మరో ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగ్గానే ఉందని వైద్యులు చెప్పినట్టు సమాచారం. ఫుడ్ పాయిజన్ కారణంగానే పయ్యావుల అస్వస్థతకు గురయ్యాడని తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

webtech_news18